Thursday, July 25, 2019
చంద్రయాన్ -2 ప్రయోగం పూర్తి వివరాలు
చంద్రయాన్ 2
· చంద్రయాన్ చంద్రయాన్ చంద్రయాన్.....
· ఈ
మిషన్ గురించిన పేరు ఇండియాలోనే కాదు ప్రపంచలో దాదాపు అన్ని దేశాల్లో అద్యక్షులు,
ప్రధానులు, మినిస్టర్ల నుంచి సై౦టిస్టూలు, టీచర్లు , విద్యార్థుల వరకూ మొత్తం మారు
మోగిపోతోంది.
· చంద్రయాన్
అంటే చ౦ద్రుడిపైకి ఏదో ఒక రాకెట్ పంపడం. అసలు అలా పంపినా దాని వల్ల డబ్బులు బొక్క
తప్పా మనకు ఏదైనా ఉపయోగం ఉందా అసలు? దీనికి అంత బిల్డప్ అవసరమా? ఇదే కదా మీ
డౌట్.
మన దేశ అంతరిక్ష
ఆణిముత్యం I.S.R.O. చేపట్టిన చంద్రయాన్ - 2 గొప్పదనం తెలియాలంటే ఇంతకుముందు అసలు
చంద్రుడిపైన ఏ ఏ దేశాలు అడుగు పెట్టాయి? ఆ దేశాలు ఏం సాధించాయి అనే విషయాలు బ్రీఫ్
గా తెలుసుకుందాం!
సాధారణంగా చంద్రుడిపై ప్రయోగం అంటే మనం మూడు
విధాలుగా అనుకోవచ్చు:
1.
చంద్రుడి ఆర్బిట్ లో ఒక శాటిలైట్
పెట్టి దాన్ని చంద్రుడి చుట్టూ తిప్పి ఫోటోలు తీసి సిగ్నల్స్ ద్వారా భూమిపైకి పంపడం.
అంటే చంద్రుడి ఆర్బిట్ లో ఒక స్పేస్ క్రాఫ్ట్ ని పంపడం. ఇప్పటిదాకా, అమెరికా,
రష్యా, చైనా, ఇండియా, జపాన్, యురోపియన్ స్పేస్ ఏజెన్సీలు ఇలా ఆర్బిట్ లో తమ తమ
స్పేస్ క్రాఫ్ట్ లను పంపాయి.
2.
చంద్రుడి పై డైరెక్టుగా మనుషుల్ని
పంపించి అక్కడి విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం. ఇలా చందమామ పైన మనుషుల్ని పంపిన ఏకైక దేశం
అమెరికా. అది కుడా కేవలం ఒకసారి మాత్రమే. ఇప్పటిదాకా ఇలా చంద్రుడిపై మనుషుల్ని
పంపి అమెరికా రికార్డుని బద్దలు కొట్టిన దేశమే లేదు.
3.
చంద్రుడిపైకి మనుషులని కాకుండా
ఏవైనా మెషీన్లు గానీ రోవర్లను గానీ పంపించి అక్కడే ప్రయోగాలు నిర్వహించడం. ఇలా
చేసేటప్పుడు చంద్రుడి ఆర్బిట్ నుంచి డైరెక్ట్ గా వాటిని విసిరేస్తే దాన్ని హార్డ్
లాండింగ్ అని, ప్యారాచుట్, లాండర్ వంటి సైంటిఫిక్ మెతడ్స్ ద్వారా నెమ్మదిగా
చంద్రుడిపై దించితే దాన్ని సాఫ్ట్ లాండింగ్ అంటారు. ఇప్పుడు ఇండియా చేసేది చంద్రుడి
పైన విక్రం అనే లాండర్ సహాయంతో ఒక రోవర్ ని క్రిందికి పంపి ప్రయోగాలు నిర్వహించడం.
అంటే సాఫ్ట్ లాండిగ్ అన్నమాట! అయితే ఇండియా కన్నా ముందే మూడు దేశాలు ఇప్పటికే
సాఫ్ట్ లాండింగ్ చేశాయి. అవి అమెరికా, రష్యా, చైనా.
@@@
ఇలాంటి
ప్రయోగం నిర్వహించడంలో భారత దేశం నాలుగో స్తానంలో ఉన్నా, ఇప్పటిదాకా ఆ దేశాలు ఎవరూ
చేయని సాహసాన్ని చేస్తోంది. అదేంటంటే ఇప్పటిదాకా చంద్రుడి ఈక్వేటర్ దగ్గరలోనే
అన్ని అన్ని దేశాలు సాఫ్ట్ లాండింగ్ చేశాయి. కానీ ఇస్రో మాత్రం చ౦ద్రుడికి అవతల
భాగం అంటే మూన్ యొక్క సౌత్ పోల్ కి 600 కిలో మీటర్ల దూరంలో రోవర్ ని సాఫ్ట్ ల్యాండ్ చేయబోతోంది. నిజానికి అక్కడ
ఎదురయ్యే సాంకేతిక కష్టాలు తట్టుకోలేక మిగతా దేశాలు చంద్రుడి సౌత్ పోల్ వద్ద ఇలాంటి
ధైర్యం చేయలేదు. అందుకే మన ఇస్రో ఎవరూ చేరుకోలేని ఈ ప్రాంతంలో పరిశోధనలు స్టార్ట్
చేయబోతోం ది. ఇన్ని డిఫికల్టీస్
ఉండబట్టే, అసలు చంద్రుడిపై వీళ్ళు ఏం చేయబోతున్నారు అని ప్రపంచం మొత్తం ఇస్రో వైపు
చూస్తోంది.
@@@
· చంద్రయాన్
-1 ప్రయోగంలో చందమామ పైన నీరు ఉన్నట్టు భారత్ కనుగొంది. ఇది 100% నిజం అని నాసా
కూడా ద్రువీకరించింది. దాదాపు 90% పైగా చంద్రుడి మాప్పింగ్ ని చంద్రయాన్ పూర్తి
చేసింది. చంద్రయాన్ -1 చేసిన పరిశోధనలు ప్రపంచ అంతరిక్ష పరిశోధనల్లో తలమానికంగా
నిలిచిచాయి.
· అందుకే
దీనికి కొనసాగింపుగా వస్తున్న చంద్రయాన్ 2 ప్రయోగం ఇంకా ఎన్ని తెలియని
ఆవిష్కారాలకు శ్రీకారం చుడుతుందో అని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
· ప్రస్తుతం
చంద్రయాన్ 2; విశ్వం యొక్క ఆవిర్భావం సంబంధించిన మూలాలను కనుక్కోవడంతో పాటు,
చంద్రుదిపైన లభించే విలువైన మూలకాలు,
ఖనిజాలు, మినరల్స్ సంబంధించిన పరిశోధనలు చేపట్టనుంది.
· భవిష్యత్తులో
న్యూక్లియర్ రియాక్షన్ ద్వారా విధ్యుత్ ఉత్పత్తి చేయడానికి హీలియం మూలకం ఎంతో
అవసరం. చంద్రుడిపై ఇది విరివిగా లభిస్తుందని భావిస్తున్నారు.
· అంతే
కాదు ప్రగ్యాన్ అనే రోవర్ ద్వారా 500మీటర్లు ఉపరితలం పై అక్కడి మట్టిని తవ్వి
అక్కడే స్వయంగా పరిశోధనలు చేస్తారు. దానితో పాటు చంద్రుడి వాతావరణంలోని అంశాలు
స్టడీ కూడా ఈ రోవర్ ద్వారా ఇక్కడినుంచే నిర్వహిస్తారు.
· ఇంత
కష్టపడి రోవర్ ని జబిల్లిపై పంపినా అది 15 రోజులు మాత్రమె పనిచేసే అవకాశం ఉంది
అంటున్నారు, ఎందుకంటే చంద్రుడిపై 15 రోజులు సూర్యుడు ఉంటె మిగతా 15 రోజులు చీకటిగా ఉంటుంది. ఈ రోవర్
పనిచేయడానికి కావలసిన సోలార్ ఎనర్జీ అందకపోతే అది పనిచేయలేకపోవచ్చు అని
భావిస్తున్నారు. అయినప్పటికీ, చందమామ పై అధ్యయనం కోసం ఇస్రో కి ఈ తక్కువ సమయం
చాలు.
@@@
· ఈ రాకెట్ ప్రయోగంలో మూడు దశలు ఉన్నాయి. రాకెట్ ప్రయోగించిన 16 నిమిషాల 13 సెకండ్లకు...
భూమి నుంచీ 181 కిలోమీటర్ల ఎత్తులో... చంద్రయాన్-2 ఉపగ్రహం, విక్రమ్
ల్యాండర్ ఉన్న పేలోడ్ రాకెట్ నుంచీ బయటకు వస్తుంది. అక్కడితో రాకెట్ పని
పూర్తయినట్లు లెక్క.
· ఈ పేలోడ్ భూ నియంత్రిత కక్ష్యా మార్గంలోకి చేరుతుంది. ఆ తర్వాత అది 17 రోజుల పాటూ రోదసిలో తిరుగుతూ... చందమామ దగ్గర్లోకి
వెళ్తుంది. ఆ తర్వాత మరో 6 రోజులు అలాగే తిప్పుతారు. ఆ తర్వాత చంద్రయాన్-2ని పేలోడ్ నుంచీ బయటకు తెస్తారు. అది 28 రోజులపాటూ చందమామ చుట్టూ తిరుగుతూ
ఉంటుంది. చివరకు అది అలా చందమామ ఆర్బిట్ లోకి చేరుతుంది.
· చంద్రయాన్-2 ప్రయోగం జరిగిన 50 రోజుల తర్వాత
పేలోడ్ నుంచీ విక్రమ్ ల్యాండర్ బయటకు వస్తుంది. ఇది 54వ రోజున అంటే సెప్టెంబర్ 6 లేదా 7న చందమామ దక్షిణ
ధ్రువంపై దిగుతుంది.
· ల్యాండర్ సేఫ్‌గా దిగిన తర్వాత... అందులోంచీ...
ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వస్తుంది.
అది చందమామపై 500 మీటర్ల ఏరియాలో తిరుగుతుంది.
· ప్రజ్ఞాన్ రోవర్... చందమామపై మట్టి, రసాయనాలు, నీటి జాడలు, మూలకాలు, ఖనిజాలు వంటి
విషయాల్ని ఇస్రోకి చేరవేస్తుంది.
· ప్రధానంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై నీరు గడ్డకట్టి ఉందని
ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకే ల్యాండర్‌ను
అక్కడ ల్యాండ్ చేస్తున్నారు.
· చంద్రయాన్-2 చంద్రుడి చుట్టూ తిరుగుతూ... చందమామను హెచ్‌డీ
ఫొటోలు తీస్తూ... ఇస్రోకు పంపుతుంది.
· ప్రజ్ఞాన్ అంటే తెలివి అని అర్థం. చంద్రయాన్-2లో చంద్రుడి చుట్టూ తిరిగే ఆర్బిటర్ కంటే... చందమామపై తిరిగే రోవర్ దే కీలక పాత్ర అనుకోవచ్చు.
ఎందుకంటే ఇప్పటివరకూ ఇలా చందమామపై రోవర్లను
దించిన దేశాలు అమెరికా, రష్యా, చైనా మాత్రమే.
· 27 కేజీల ప్రజ్ఞాన్ రోవర్... నీటికి సంబంధించి
ఎలాంటి సమాచారం ఇస్తుందా అని శాస్త్రవేత్తలు ఆసక్తిగా చూస్తున్నారు.
చందమామపై కావాల్సినంత నీరు ఉంటే...
ఇక మనుషులు అక్కడకు వెళ్లి, కాలనీలు ఏర్పాటు చేసుకునేందుకు వీలవుతుంది.
· ఐదేళ్లుగా చేస్తున్న ఈ మొత్తం ప్రాజెక్టుకు అయిన ఖర్చు రూ.978
కోట్లు అంటే 142 మిలియన్ డాలర్లు. ఆ మధ్య వచ్చిన
హాలీవుడ్ అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమాకు అయిన ఖర్చు 356 మిలియన్ డాలర్లు. ఇంత తక్కువ ఖర్చుతో
అంత ఎక్కువ ప్రయోజనాలు కలిగిస్తున్న ఇస్రోపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు
కురుస్తోంది.
@@@
ఇస్రో ఒక మూఢనమ్మకాల పుట్ట!
ప్రపంచ అంతరిక్ష రంగంలో భారతదేశం
అమెరికా, రష్యా, చైనా తర్వాత నాల్గవ
స్థానంలో ఉంది. కానీ మూఢనమ్మకాలను, జోతిష్యాన్ని నమ్మడంలో
మాత్రం మొదటి స్థానంలో ఉంది. (ఉందనే విమర్శ ఉంది).
🌍🌍🌍
ఇస్రో మూఢనమ్మకాలను పాటించింది అనడానికి కొన్ని ఆధారాలు ఇక్కడ మనం
చూద్దాo!
1.
ఇస్రో ఇప్పటిదాకా.... అన్ని సాటిలైట్లు, రాకెట్లను
ముహుర్తాలు చూసి కౌంట్ డౌన్ ని నిర్ణయిస్తూ వస్తోంది. రాహుకాలంలో కౌంట్ డౌన్ ని
ఎప్పుడూ స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే చంద్రుణ్ణి, సూర్యుణ్ణి
మింగే రాహువు కేతువులు ఎక్కడ ఈ రాకెట్లను మింగుతాయేమో అని కాబోలు...
2.
ఇస్రో ఏదైనా రాకెట్ మిషన్ ని ప్రయోగించే ముందు తిరుమల వెంకన్న పాదాల
చెంత ఆ ప్రయోగం నమూనా ఉంచి పూజలు జరిపిస్తారు.
అంతే కాదు ప్రయోగ సందర్భంలో శ్రీహరికోట సమీపంలోని కొన్ని దేవాలయాల్లో ఇస్రో శాస్త్రవేత్తలు, అక్కడి స్టాఫ్ పూజలు నిర్వహిస్తారు.
అంతే కాదు ప్రయోగ సందర్భంలో శ్రీహరికోట సమీపంలోని కొన్ని దేవాలయాల్లో ఇస్రో శాస్త్రవేత్తలు, అక్కడి స్టాఫ్ పూజలు నిర్వహిస్తారు.
3.
ఒక రిటైర్డ్ ఇస్రో సైoటిస్టు చెప్పిన
దానిప్రకారం ౼ ఏదైనా మిషన్ లాంచింగ్ రోజు దాని ప్రాజెక్ట్ డైరెక్టర్ కొత్త చొక్కా
ధరించి రావడం సెంటిమెంట్ గా భావిస్తారు. అలా ధరించడం వల్ల ప్రోగ్రాం సక్సస్
అవుతుంది అని భావిస్తారు.
4.
ఇస్రో గెలుపు గుర్రంగా PSLV రాకెట్ ని
భావిస్తారు. సాధారణంగా ఉపగ్రహాల్ని ప్రయోగించేటప్పుడు ఒక సీక్వెన్స్ లో నంబరింగ్
ఇస్తారు. మొదట ప్రయోగించిన దానికి PSLV C1, రెండవడానికి PSLV
C2.... అని వరుసగా నంబర్లు ఇస్తారు. కానీ 13 అనే
సంఖ్య లక్కీ నెంబర్ కాదు అని PSLV C13 ని స్కిప్ చేసి PSLV
C14 ని లాంచ్ చేశారు. వాళ్ళు ఎందుకు ఇలా PSLV సి13
ని స్కిప్ చేశారో ఇప్పటిదాకా ఇస్రో లాజికల్ గా సమాధానం చెప్పలేదు.
5.
ఇస్రో ఇంతవరకూ ఎప్పుడూ మంగళవారం రోజు ప్రయోగాన్ని చేపట్టలేదు. హిందూ
సంప్రదాయంలో మంగళవారాన్ని అశుభంగా భావిస్తారు. అయితే అంగారక గ్రహం పై ప్రయోగించిన
మంగళ్యాన్ మిషన్ కి జోతిష్యం ప్రకారం మంగళవారం అచ్చివస్తుందని భావించి మంగళవారం
రోజునే ఈ ప్రయోగాన్ని చేపట్టారు.
6.
చంద్రయాన్ 2 మిషన్ స్టార్ట్ చేయడానికి
కొద్దిరోజుల ముందు ఈ మిషన్ సక్సస్ కోసం ఆశీర్వాదం పొందడానికి ఇస్రో చైర్మన్ ఉడిపి
కృష్ణ మఠానికి వెళ్లారు. అక్కడ పీఠాదిపతులతో చంద్రయాన్ సక్సస్ అవ్వాలని పూజలు
జరిపించారు.
(ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి)
ఈ విధంగా ఇస్రో... మూఢనమ్మకాలు, జోతిష్యం,
న్యూమరాలజీ పట్ల విపరీతమైన నమ్మకాన్ని ఉంచుకొన్నది.
🌍🌍🌍
జవహర్ లాల్ నెహ్రు "తన డిస్కవరీ ఆఫ్ ఇండియా" పుస్తకంలో
సైoటిఫిక్ టెంపర్ గురించి ప్రస్తావిస్తూ ౼
శాస్త్రీయ విధానం, విజ్ఞానం, సత్యం, కొత్త విజ్ఞానం కోసం అన్వేషణ , అధ్యయనం మరియు విచారణ లేకుండా ఏదైనా అంగీకరించడానికి నిరాకరించడం భారతదేశ
భవిష్యత్తుకు ఎంతైనా అవసరం అని పేర్కొంటారు. ఇది కేవలం సైన్స్ విషయంలో మాత్రమే
కాదు, జీవితంలో కూడా అనేక సమస్యల పరిష్కారానికి వర్తిస్తుందని
సెహ్రూ భావించారు.
(Ref:-
1946, ది డిస్కవరీ ఆఫ్ ఇండియా , పే.నెం.512)
అంతే కాదు, శాస్త్రీయ దృక్పధం, మనవతావాదం, అధ్యయనం, శోధన,
సంస్కరణాభిలాశ వంటి వాటిని ప్రతి పౌరుడు కల్గివుండలి అని భారత
రాజ్యాంగం ఫండమెంటల్ డ్యూటీస్ లో పేర్కొంటుంది.
(Ref:-
Part IVA of the Constitution of India)
కానీ, సామాన్య పౌరులు, నిరక్షరాస్యుల సంగతి అటూఉంచితే దేశంలో సైన్స్ పట్ల విశ్వసాన్ని పెంచే భారత
అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో.... సైన్స్ తో పాటూ మూఢ నమ్మకాలను కూడా ఎంకరేజ్
చేస్తోంది.
వీటికి బదులు ఏ మంత్రించిన తాయత్తునో, రెండు నిమ్మకాయలనో రాకెట్ కి కట్టి ప్రయోగిస్తే అసలు ఫెయిల్యూర్లు అనేవే
ఉండవు కదా....
🌍🌍🌍
ISRO
అంటే Indian Space Research Organisation మాత్రమే
కానీ,
ఇండియన్ సూపర్స్టిషన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మాత్రం కాదు...
ఇండియన్ సూపర్స్టిషన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మాత్రం కాదు...
మై డియర్ ఇస్రో... ఇకనైనా మేలుకో!!
జింక పిల్ల కాదు అడవి పులి | An uncovered story of Hima Das #Himadaas
12 వ తేది గురువారం జులై 2018
అది ఫిన్ లాండ్ లోని టంపెరె (Tampere) నగరం.
ప్రపంచ అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో 400మీటర్ల
అథ్లెటిక్స్ ఫైనల్ జరగడానికి అంతా సిద్ధంగా ఉంది.
భారతదేశం తరపున ప్రపంచ అథ్లెటిక్స్ లో గోల్డ్ మెడల్
సాధించిన అమ్మయిలు ఇప్పటిదాకా ఎవరూ లేరు. ఇంత
పెద్ద దేశం, నూటా ముప్పై కోట్లకు పైగా జనాభా ఉన్న దేశం...
ఇన్ని కోట్లమందిలో ఇంతవరకు ఒక్కరూ కుడా గోల్డ్ మెడల్ సాధించలేకపోయారు.
యధావిదిగానే మొక్కబడిగా భారతదేశం తరపున ఒక 18 ఏళ్ల అమ్మాయి
బరిలో దిగింది.
౩....2.....1..... ట్రిగ్గర్ పేలింది ....రేస్ స్టార్ట్
అయింది.
అనేక దేశాల నుంచి వచ్చిన అథ్లెట్స్ అందరూ వారి వారి
శక్తిని కూడగట్టుకొని పరుగుతీయడం స్టార్ట్ చేసారు....
భారత్ తరపున 4వనెంబరు లైనులో పరుగుపెట్టిన అమ్మాయి ఎప్పటిలాగే
రేసులో వెనకపడింది. కానీ ఈ కొత్తమ్మాయిపై కొన్ని ఆశలు ఉన్నాయి.
మొదటి 50 -100 మీటర్ల పరుగులో వెనుక ఉన్న ఆ అమ్మాయి,
ఒక్కసారిగా మొదటి స్తానంలో ఉన్న రుమేనియా అథ్లెట్ ఆండ్రియా ను అనూహ్యంగా వెనక్కు
నెట్టి ముందుకు పరుగెడుతోంది. గేం చూస్తున్న అందరూ షాక్... ఎవరీ జింక పిల్ల అని
గ్యాలరీలో ప్రేక్షకులు గుసగుసలాడుకుంటున్నారు.
చివరి నిమిషం ... అంతా ఉత్కంట.... ఆట పూర్తి అయింది.
కట్ చేస్తే..., 400మీటర్ల ఫైనల్లో 51.46 నిమిషాల్లో గమ్యం చేరి తొలిస్థానంతో బంగారు పతకం అందుకుంది ఆ అమ్మాయి.
వామ్మో ఈ అమ్మాయి జింక పిల్ల కాదు, చిరుత పులి అని అందరూ
చప్పట్లు కొట్టారు.
ధింగ్ ఎక్ష్ప్రెస్స్ అని పిలుచుకునే ఈ గోల్డెన్ లేడీ పేరు
‘హిమాదాస్’.
భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన హిమాదాస్ ... ఇంటర్నేషనల్ ట్రాక్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించిన
తొలి భారత స్ర్పింటర్‌గా రికార్డు నెలకొల్పింది.
ఆమె మెడల్‌ను అందుకున్న సమయంలో భావోద్వేగానికి లోనైంది.
మెడల్ సెర్మనీ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న
సమయంలో హిమదాస్ రాల్చిన ఆనందభాష్పాల వీడియో షోషల్ మీడియా అంతా వైరల్ అయింది..
జనగణమన వల్లిస్తూనే ఆమె కన్నీరును ఆపుకోలేకపోయింది.
మహాంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహాంద్రా ఆ వీడియోను తన
ట్విట్టర్ కాతాలో లో పోస్ట్ చేసారు.
ఇది మిమ్మల్ని కదిలించకపోతే, ఇక ఏదీ
మిమ్మల్ని కదిలించలేదని ఆయన తన ట్యాగ్‌లైన్‌లో పేర్కొన్నారంటే, ఈ విజయం వెనుక
కష్టం అర్థం అవుతుంది.
అంతర్జాతీయ ట్రాక్ మీద పరుగులు మొదలెట్టిన కేవలం 18 నెలలలోనే హిమాదాస్
ఈ విజయాన్ని సాధించినది. జూనియరు విభాగంలో బంగారు పతకాన్ని పొందిన ఒక సినియరు గా మరియు
జూనియరు విభాగాల్లో బ౦గారు పతకంపొందిన ఏకైక భారతీయ మహిళ గా హిమదాస్ చరిత్ర పుటల్లో
నిలిచిపోయింది.
బ్రాండెడ్ షూ కూడా కొనలేని స్థిలో ఉన్న హిమాదాస్
విజయాన్ని చూసి... అడిదాస్ కంపెనీ హిమాదాస్ పేరుమీద ఒక షూ బ్రాండ్ నే ప్రారంభించింది
అంటే హిమాదాస్ విజయం ఎంత గొప్పదో తెలుస్తోంది.
19
ఏళ్ల ఈ అసోం రన్నర్ యూరప్ లో జరిగిన అంతర్జాతీయ స్థాయి ఆటల్లో వరుస పసిడి పతకాలతో
సంచలనం సృష్టిస్తోంది.. కేవలం 18 రోజుల్లో ఏకంగా ఐదు స్వర్ణాలు
కొల్లగొట్టి భారత్ కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపజేసి మరో పీటీ ఉషగా మన్ననలు
అందుకుంటోంది.
అస్సాం రాష్ట్రం, నాగోన్ జిల్లా, థింగ్ పట్టణానికి
సమీపంలో కందులిమరి గ్రామం పొలం గట్ల మీద మొదలైన హిమ దాస్ పరుగు ఫిన్లాండ్‌లోని
టాంపేర్ స్టేడియం ట్రాక్ ఎక్కింది. ఈ రెండింటి మధ్య సాగిన హిమ ప్రయాణం అంత పెద్దదీ కాదు, మరీ చిన్నదీ కాదు. గోల్డ్ మెడల్ కోసం ఆమె ఆయాస పడి శ్రమించింది లేదు, ఒక ఏడాది కష్టపడిందంతే. అలాగని వడ్డించిన విస్తరిలా ఆమెకు అన్నీ సిద్ధంగా ఉన్నాయా అంటే.. ఏ ఒక్క సౌకర్యమూ లేదు. కనీసం కాళ్లకు స్పోర్ట్స్ షూ కొనడానికి
కూడా తండ్రి దగ్గర డబ్బుల్లేవు.
హిమాదా్‌సది పేద వ్యవసాయం కుటుంబం. రన్నర్‌గా తొలి
అడుగులు తన పొలంలోనే వేసింది. నాన్న వారి పండించే సాధారణ రైతు. వారి మళ్ళలోని బురదలో ఒట్టి కాళ్ళతో చిన్న
చిరుత పిల్లలా హిమాదాస్ పరుగెడుతూ ఉండేది.
స్కూల్ స్థాయిలో ఆమె అక్కడి మగపిల్లలతో కలిసి మొదట ఫుట్‌బాల్ ఆడేది.
ఆమె పరుగులో వేగం గుర్తించిన అక్కడి కోచ్ సలహా మేరకు ఆమె ట్రాక్,ఫీల్డ్‌లోకి అడుగు పెట్టింది.
అథ్లెటిక్స్ కోచ్ నిపన్ దాస్ చొరవతో 2017లో గువాహటి చేరిన హిమ అక్కడ తన ప్రతిభకు మరింత పదును పెట్టింది.
అనతికాలంలోనే 100, 200 మీటర్లలో
మెరుపులు మెరిపించింది.
అయితే 400 మీటర్లలో అయితే ఆమెకు తిరుగుండదని భావించిన కోచ్ నిపన్
దాస్ ఆమెను ఆ విభాగంలో మేటిగా తీర్చిదిద్దాడు.
2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడల 400 మీటర్ల పరుగులో ఫైనల్‌కు చేరిన హిమ 51.32 సెక న్ల టైమింగ్‌తో ఆరో స్థానంలో నిలిచింది.
అయితే ఆ గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన అథ్లెట్ కంటే హిమాదాస్ సమయం కేవలం 1.17 సెకన్లే తక్కువ.
తర్వాత అండర్-20 వరల్డ్ చాంపియన్ షిప్లో 400 మీటర్ల రేసులో స్వర్ణ
పతాకాన్ని సాధించడంతో హిమాదాస్ పేరు ఒక్కసారిగా
మార్మోగింది.
ప్రపంచ చాంపియన్ అయిన తర్వాతనుంచి అసోం ప్రజ లు ఆమెను ముద్దుగా ‘ధింగ్ ఎక్స్‌ప్రె్‌స‘గా పిలుస్తున్నారు.
గత ఆసియా క్రీడల్లో 400 మీటర్ల పరుగులో 50.79 సెక న్ల జాతీయ రికార్డ్ టైమింగ్‌తో రజత పతకం సొంతం
చేసుకుంది.
అలాగే మహిళల 400మీ. రిలేలో స్వర్ణంతోపాటు 400మీ.
mixed రిలేలో కూడా స్వర్ణాన్ని ముద్దాడింది.
2018 ఏప్రిల్‌లో దోహాలో జరిగిన ఏషియా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ 400 మీటర్ల హీట్స్ సందర్భంగా వెన్నునొప్పితో ఆమె మధ్యలోనే
వైదొలగింది.
ఆతర్వాత కోలుకున్న ఆమె ప్రస్తుతం యూర ప్‌లో పాల్గొంటున్న అంతర్జాతీయ
టోర్నీల్లో పసిడి పతకాలతో హోరెత్తిస్తోంది.
అయితే హిమాదాస్ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. బోర్ అథ్లెటిక్స్ మీట్‌లో 400 మీ.
రేసులో ఈ సీజన్‌లో తన కెరీర్ లోనే అత్యుత్తమ సమయం - 52.09 సెకన్లను నమోదుచేసింది.
కానీ వచ్చే 2019 సెప్టెంబరులో జరిగే వరల్డ్ చాంపియన్‌షి్‌పనకు క్వాలిఫై
అవ్వాలంటే 51.80 సెకన్లలో పరుగును కంప్లీట్ చేయాలి. దీనితో 2019 లో జరిగే వరల్డ్స్
చాంపియన్ షిప్ అవకాశాన్ని మాత్రం త్రుటిలో చేజార్చుకుంది. అంతే కాదు, రాబోయే ఒలంపిక్స్ లో అర్హత సాధించాలి అంటే హిమాదాస్ ఇంకా తన
పరుగును మేరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
2018 లో భారతదేశం అర్జున అవార్డుతో ఆమెని సత్కరించింది. UNICEF భారదేశ మొట్టమొదటి యూత్ అంబాసిడర్ గా హిమా దాస్
ని అప్పాయింట్ చేసింది. అసం ప్రభుత్వ౦ రాష్ట్ర స్పోర్ట్స్ బ్రాండ్ అంబాసిడర్ గా
హిమదాస్ ని ఏమ్పికచేసుకుంది.
ఇన్ని
సాధించినా హిమాదాస్ పేరు చాలా కొద్దిమందికే తెలుసు. దీనికి కారణం మన మీడియాలో
కవరేజ్ లేకపోవడం. ప్రపంచంలో ఉన్న 200
దేశాల్లో పట్టు మని పది దేశాలు కుడా ఆడని
క్రికెట్ ని, ఓడిపోయినా పి.వి. సింధూ, కోనేరు హంపీ, సానియా మీర్జాను కవర్చేస్తూ
నిత్య వార్తలుగా ప్రచ్చురించే మీడియా హిమా దాస్ విజయాలను కవర్ చేయకపోవడంతో
కులాలవారీగా మీడియా వివక్ష చూపిస్తోందని కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం
చేస్తున్నారు.
Subscribe to:
Posts (Atom)